Credits
AUSFÜHRENDE KÜNSTLER:INNEN
Chitra
Künstler:in
KOMPOSITION UND LIEDTEXT
S. A. Raj Kumar
Komponist:in
E S Murthy
Songwriter:in
Lyrics
చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి పరుగెందుకే మనసా
తుళ్ళి తుళ్ళి తూలే చిట్టి తూనీగలా అలుపన్నదే రాదా
ఎక్కడో పూల పొదరిళ్ళలో తుమ్మెదే వాలి ఝుమ్మంటే
రివ్వని గువ్వలా నింగిలో నువ్విలా తేలిపోతుంటే
ఎలా నిన్ను ఆపను వయసా
అణువు అణువు అందమేలె నీలి మేఘాలకి
ఆశ పడిన చందమామ అందరాదే మరి
ఈ గమ్మత్తో చేసి ఈ అందాలే తెచ్చి నా గుండెల్లో దాచాలి
నా ఒళ్ళంత మెరిసి మా ఊరంతా చూసి నా చుట్టూరా చేరాలి
ఏమే చిలకా ఏమంటావే? నీకంటే నే బాగుంటాలే తెలుసా
చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి పరుగెందుకే మనసా
తుళ్ళి తుళ్ళి తూలే చిట్టి తూనీగలా అలుపన్నదే రాదా
మిడిసి పడకే చిలిపి గాలి లాగి నా పైటని
ఎగిరిపోకే జిలుగు పైట ఇంత చిరుగాలికి
ఆ కొమ్మల్లో పిట్ట కూ కుక్కూ అంటుంటే నా ఒళ్ళేమో ఝల్లంది
నా అందాల రాజు, ఓ అంబారి తెచ్చి రా రమ్మన్నట్టే ఉంది
అరె తీరా చూస్తే ఏమీలేదు, ఇంకా నున్ను ఊరించొద్దు మనసా
చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి పరుగెందుకే మనసా
తుళ్ళి తుళ్ళి తూలే చిట్టి తూనీగలా అలుపన్నదే రాదా
ఎక్కడో పూల పొదరిళ్ళలో తుమ్మెదే వాలి ఝుమ్మంటే
రివ్వని గువ్వలా నింగిలో నువ్విలా తేలిపోతుంటే
ఎలా నిన్ను ఆపను వయసా
Writer(s): S.a.raj Kumar, E.s. Murthy
Lyrics powered by www.musixmatch.com