Music Video

Featured In

Credits

AUSFÜHRENDE KÜNSTLER:INNEN
Vijay Bulganin
Vijay Bulganin
Künstler:in
Lakshmi Meghana
Lakshmi Meghana
Künstler:in
KOMPOSITION UND LIEDTEXT
Vijay Bulganin
Vijay Bulganin
Komponist:in
Suresh Banisetti
Suresh Banisetti
Songwriter:in

Lyrics

కన్నీటి సంద్రంలోన కంటిపాపే జారిపోదా కాసేపు నిన్ను చూడకుంటే ఏవే ఏవెవరరే నిన్నటి కలలు లేవు లేవులే నా చిన్ని గుండెల్లోనా ఎండమావి చేరిపోదా నీ నవ్వే నాకు దూరమైతే ఏంటి ఏంటి ఇది ఇంతటి బరువు మోయలేనులే వస్తున్నా వస్తున్నా నీకోసం వస్తున్నా సుడిగాలి వేగంతో నీ వైపే వస్తున్నా ఏ దారి మూస్తున్నా ఏ దాడి చేస్తున్నా ప్రాణాలే తీస్తున్నా నిన్నొదులుకోను హామీ ఇస్తున్నా చిలకా ఓ రామచిలకా చెరిగేది కాదే ఎదపై నీ ముద్దు మరకా చిలకా ఓ రామచిలకా ఆరేది కాదే రగిలే ఈ ప్రేమ తునకా నా ఆశలకే ఆయువిమ్మని నా ఊహలకే ఊపిరిమ్మని నా చీకటికే వెలుగు ఇమ్మని ఎవరినడగడం నీ కంటపడే వీలు లేదని నీ వెంట వచ్చే దారి లేదని నా జీవితమే జారుతోందని ఎలా తెలుపడం ఒక్క పూట ఉండలేకపోయా నువ్వు లేక వందేళ్లెట్టా గడపాలిక కన్న కలలే కట్టుకధలాగా మార్చినది కాలానికే దయ లేదుగా చిలకా ఓ రామచిలకా చెరిగేది కాదే ఎదపై నీ ముద్దు మరకా చిలకా ఓ రామచిలకా ఆరేది కాదే రగిలే ఈ ప్రేమ తునకా ఆ వెన్నెలనే అడిగి చూసా ఈ వేకువనే అడిగి చూసా నీ జాడనే చూసి చెబుతాయేమో అని ఈ గాలితో కబురు పంపా మేఘాలతో కబురు పంపా నా వేదనే నీకు వివరించాలి అని ఈ కాలం పైన కత్తి దుయ్యాలనుంది నిన్ను ఇంకా దాచిపెట్టినందుకు నా దేహం పైన మట్టి పొయ్యాలనుంది నాకు నీతో రాసి పెట్టనందుకూ చిలకా ఓ రామచిలకా ఓ రామచిలుకా కన్నీటి సంద్రంలోన కంటిపాపే జారిపోదా కాసేపు నిన్ను చూడకుంటే ఏవే ఏవెవరే నిన్నటి కలలు లేవు లేవులే నా చిన్ని గుండెల్లోనా ఎండమావి చేరిపోదా నీ నవ్వే నాకు దూరమైతే ఏంటి ఏంటి ఇది ఇంతటి బరువు మోయలేనులే వెళ్తున్నా వెళ్తున్నా దూరంగా వెళ్తున్నా వెళ్లాలని లేకున్నా భారంగా వెళ్తున్నా నువ్వెంత రమ్మన్నా రాలేను అంటున్నా నేనంటూ ఏమైనా నువు క్షేమంగుంటే చాలనుకుంటున్నా చిలకా ఓ రామచిలకా నా మనసే నీకు ఎపుడో ఇచ్చాను గనకా చిలకా ఓ రామచిలకా జత రావొద్దంటే అలుపే ఒంటరి నడకా
Writer(s): Suresh Banisetti, Vijai Bulganin Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out