Titres similaires
Crédits
AUSFÜHRENDE KÜNSTLER:INNEN
Yazin Nizar
Künstler:in
KOMPOSITION UND LIEDTEXT
Sam C.S.
Komponist:in
Vanamali
Songwriter:in
Paroles
హే దైవమా దైవమా
నాపై దయ కనరా
ఎదలో నిండే ఉంటావు
నీవే నా మదిలో
నిండితే అంతే చాలంట
రా ఇకనైనా
రాలేవా రాలేవా చేయూతగ నువు రాలేవా
కనలేవా కనలేవా కడ ఊపిరినే కనలేవా
ఓ మరిచావ మరిచావ కలతులు చెరపగ మరిచావ
అవలేవ అవలేవ మనసుకు ఇంధనమవలేవ
ఆహార్యం నీవే ఆనందం నీవేలే
నాలో లోలోన ఆడే నాట్యం నీవేలే
పాదం నీవేలే
ప్రతి శ్వాస నీవేలే
నాలో లోలోన తీసే పరుగే నీవేలే
నిశిలో ఒరిగి కుమిలే శోకం కాగా
నిన్నే కొలిచే లేచా నీ చేయి సాయం రాగా
దేవా దేవా దారి చూపు దేవా దేవా
స్వరమవు దేవా దేవా చెలరేగు దేవా దేవా
రాలేవా రాలేవా చేయూతగ నువు రాలేవా
కనలేవా కనలేవా కడ ఊపిరినే కనలేవా
ఎరుగను ఏ అడ్డు కలైనా
అడుగులు ఆగవు ఏ క్షణాన
కదిలే జగమంతా నువ్వేనా
నాలో నువ్వే
కడుపున నటనం నీ విలాసం
కడపటి నటనం నీ విలాసం
నడుమన ఎదలో సెగ నివాసం
నీవేగా ఓ దేవా
నిషివై నిషివై నిశినొక పగలై
పగలై పగలై పగటికి రవివై
రవివై రవివై రవినొక వెలుగై
వెలుగై వెలుగై మనసున నిండేవా
నా పాదం ముద్రించే చిత్రాలు నీకే సొంతం
నా కంట పూచేటి ఆనందం నీకే సొంతం
నా ఎదలో మోగేటి సవ్వళ్ళు నీకే సొంతం
నే విన్న చప్పట్ల సందళ్ళు నీకే సొంతం
నిశిలో ఒరిగి కుమిలే శోకం కాగా
నిన్నే కొలిచి లేచా నీ చేయి సాయం రాగా
దేవా దేవా దారి చూపు దేవా దేవా
స్వరమవు దేవా దేవా చెలరేగు దేవా దేవా
నిశిలో ఒరిగి కుమిలే శోకం కాగా
నిన్నే కొలిచి లేచా నీ చేయి సాయం రాగా
దేవా దేవా దారి చూపు దేవా దేవా
స్వరమవు దేవా దేవా చెలరేగు దేవా దేవా
Writer(s): Vanamali
Lyrics powered by www.musixmatch.com